TS News: భువనగిరి హాస్టల్లో సూసైడ్ చేసుకున్న బాలికల పోస్టుమార్టం పూర్తి
TS News: సూసైడ్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన భువనగిరి పోలీసులు
TS News: భువనగిరిలోని ఎస్సీ హాస్టల్లో నిన్న అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల పోస్టుమార్టం పూర్తి అయింది. భువనగిరి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలికల మృతదేహాలను వారి వారి కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. వైష్ణవి మృతదేహాన్ని జనగామ జిల్లా వెంకటాద్రిపేటకు తరలిస్తుండగా..... భవ్య మృతదేహాన్ని వరంగల్ జిల్లా బుద్ధారావు పేటకు తరలిస్తున్నారు. విద్యార్థినులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.