Dharani: సిద్ధమైన ధరణి కమిటీ నివేదిక

Dharani: రెండు రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్న కమిటీ

Update: 2024-07-01 13:54 GMT

Dharani: సిద్ధమైన ధరణి కమిటీ నివేదిక

Dharani: ధరణి పోర్టల్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. నివేదికను రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కమిటీ అందించనుంది. వందకుపైగా సూచనలతో కమిటీ రిపోర్ట్ రెడీ చేసింది. 1971 ROR చట్టాన్ని తిరిగి తీసుకురావాలని సూచించినట్లు సమాచారం. భూములకు సంబంధించిన చట్టాలన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్న కమిటీ... కలెక్టర్ వద్ద ఉన్న అధికారాలను ఎమ్మార్వో. ఆర్డీవోలకు బదిలీ చేయాలని సూచించింది. సర్వేయర్ల రిక్రూట్ మెంట్ చేసి... భూముల వాస్తవ పరిస్థితిపై పూర్తి స్థాయి సర్వే చేయాలని తెలపనుంది. భూముల సమస్యపై దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమస్య పరిష్కారం చూపే విధంగా నిబంధనలు తీసుకురావాలని ధరణి కమిటీ ప్రభుత్వానికి సూచించనుంది.

Tags:    

Similar News