TS POLYCET 2021: నేడు తెలంగాణ పాలిసెట్ పరీక్ష
TS POLYCET 2021: హజరు కానున్న 1.02 లక్షల మంది విద్యార్థులు * ఇంజినీరింగ్ కోసం 64,898
TS POLYCET 2021: ఇవాళ తెలంగాణ పాలిసెట్ ఎగ్జామ్ జరగనుంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు 2021 -22 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్, అగ్రికల్చర్, వెటర్నరీ డిప్లొమో కోర్సులతో పాటు బాసర RGUKT లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్ పరీక్ష ఇవాళజరగనుంది. ఈసారి సుమారు 1.02 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేశారు. అందులో ఇంజినీరింగ్ కోసం 64వేల 989, అగ్రికల్చర్ కోసం 37వేల 598 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 411 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 11 గంటల నుంచి 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.