మున్సిపల్ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ
మున్సిపల్ ఎన్నికలపై ఉత్తమ్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు -కాసేపట్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ -120 మున్సిపాల్టీలు, 10 కార్పోరేషన్లకు ఎన్నికలు -385 డివిజన్ లు, 2727 వార్డులకు ఎన్నికలు -జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకర
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. యథాతధంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలపై ఉత్తమ్ పిటిషన్ సహా ఇతర అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్, వనపర్తి మున్సిపాల్టీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బేంచ్ స్టే ఇచ్చింది. దీంతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ లోని 3, 24, 25 డివిజన్లపై కూడా స్టే విధించింది. రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా జరగలేదని హైకోర్టు సింగిల్ బేంచ్ స్టే ఇచ్చింది. వీటికి ఎన్నికల సంఘం నోటిపికేషన్ నిలిపి వేయనుంది.
జనవరి 8 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 12, 13 తేదీల్లో తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జనవరి 22న పోలింగ్, 25న కౌంటింగ్ నిర్వహించనున్నారు.