Lockdown In Telangana: తెలంగాణ లో లాక్ డౌన్ తప్పదా?
Lockdown In Telangana: రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే అంశంపై నేడు జరిగే కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం
Lockdown In Telangana: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదా అంటే అవుననే అని సమధానం వస్తోంది. కారణం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుడడమే. అయితే దీని పై ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా కరోనా కోరాలు చాస్తూనే వుంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడగా వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ పెట్టాల్సిందే అని అనేక సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి రోగులు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారికి చికిత్స అందించడం సమస్యగా మారుతోందని, తెలంగాణలోని బాధితులకు పూర్తి స్థాయిలో సేవలందించలేక పోతున్నామని, టీకాలు, ఆక్సిజన్, రెమ్ డెసివిర్ వంటి ఔషధాలకు ఇబ్బందిగా ఉందని వైద్య ఆరోగ్య వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూ అమల్లో వున్నా మహమ్మారి కట్టడి కావడం లేదని వారు తెలిపారు. లాక్ డౌన్ పెట్టడం వల్ల కరోనా నియంత్రణ సాధ్యమని స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర హైకోర్టు సైతం వారాంతపు లాక్ డౌన్ విషయమై ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పెడితే తలెత్తే పరిణామాలు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద ప్రభావం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కేబినెట్ ఆమోదం తెలిపితే ఒకటి, రెండు రోజుల సమయం ఇచ్చి రంజాన్ తరువాత (మే15) నుంచి లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో వున్నట్లు సమాచారం. అంతే కాకుండా తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకాలకు అనుమతి, హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గించేందకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతుల ఏర్పాటు, టీకాలు, ఇంక్షన్లు, ఔషధాల కొరతలను అధిగమించడం, ఆక్సిజన్ లభ్యతకు సన్నాహాలు వంటివి చర్చించనున్నట్లు సమాచారం.