CPM ఆఫీస్‌లో షర్మిల వర్సెస్ తమ్మినేని వీరభద్రం.. నేనేమీ బీజేపీకి..
T-SAVE: సీపీఎం కార్యాలయంలో తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.
T-SAVE: సీపీఎం కార్యాలయంలో తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల. T-SAVE ఫోరంలో భాగస్వామ్యం కావాలని సీపీఎంను ఆహ్వానించారు షర్మిల. అయితే.. సీపీఎం ఆఫీస్ వేదికగా షర్మిల, తమ్మినేని మధ్య మాటల యుద్ధం జరిగింది. బీజేపీకి YSRTP బీటీమ్‌గా పనిచేస్తోందని తమ్మినేని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన షర్మిల.. తాము కాదు.. బీఆర్ఎస్కు సీపీఎం బీటీమ్ అని అన్నారు. మునుగోడు ఉపఎన్నికకు కూడా బీఆర్ఎస్కు కమ్యూనిస్టులే బీటీమ్‌గా పనిచేశారని చురకలు అంటించారు. YSRTP ఏ పార్టీకి కూడా ఇప్పటివరకు బీటీమ్‌గా పనిచేయలేదని అన్నారు షర్మిల.