Bellampalle: బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు విద్యార్థుల ఆందోళన
Bellampalle: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో లేకపోవడంతో విద్యార్థులకు నచ్చజెప్పిన పోలీసులు
Bellampalle: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురిచేస్తూ దాడికి పాల్పడుతున్నాడని ధర్నాకు దిగారు. క్యాంప్ ఆఫీస్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు తమకు ప్రిన్సిపాల్ వద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లేకపోవడంతో పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి పంపించారు. ప్రిన్సిపాల్ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. చర్యలు తీసుకుంటామన్నారు.