Hyderabad: దేశంలోనే టాప్ 2 ప్లేసులో సోమాజిగూడ.. ఎందులో అంటే..?

Hyderabad: హైదరాబాద్ సోమాజీగూడ రోడ్ అరుదైన ఘనత దక్కించుకుంది.

Update: 2023-05-11 15:00 GMT
Somajiguda is the Second Best High Street in the India

Hyderabad: దేశంలోనే టాప్ 2 ప్లేసులో సోమాజిగూడ.. ఎందులో అంటే..?

  • whatsapp icon

Hyderabad: హైదరాబాద్ సోమాజీగూడ రోడ్ అరుదైన ఘనత దక్కించుకుంది. దేశంలోనే అత్యంత ఖరీదైన వీధుల్లో ఒకటిగా సోమాజీగూడ రోడ్ నిలిచింది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియాలోని 30 మార్కెట్లలో సర్వే నిర్వహించింది. యాక్సెస్, పార్కింగ్, షాపులు ఇలాంటి పారామీటర్స్ ఆధారంగా వీధులకు ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాకింగ్స్ లో బెంగళూరులోని మహాత్మాగాందీ రోడ్డు నంబర్ 1 గా నిలవగా ఆ తర్వాతి స్థానాన్ని సోమాజీగూడ రోడ్డు కైవసం చేసుకుంది.

జుయెలరీ షోరూమ్స్, పలు కంపెనీల ఆఫీసులు, క్లాత్ షోరూమ్స్ ఎక్కువగా ఉన్న సోమాజీగూడలో కొనుగోలుదారులకు అనువైన అన్ని సదుపాయాలు ఉన్నాయని నైట్ ఫ్రాంక్ తన సర్వే రిపోర్ట్ లో తెలిపింది. సోమాజీగూడలో ఒక చదరపు అడుగుకు నెలకు రూ.150 నుంచి రూ.175 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ముంబై లింకింగ్ రోడ్, ఢిల్లీ సౌత్ ఎక్స్ టెన్షన్ పార్ట్ 1, 2, కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్, కామాక్ స్ట్రీట్, చెన్నై అన్నానగర్, బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్, నోయిడా సెక్టార్ 18 మార్కెట్, బెంగళూరు బ్రిగేడ్ రోడ్, బెంగళూరు చర్చి స్ట్రీట్ ఆ తర్వాత స్థానాలను ఆక్రమించాయి.

Tags:    

Similar News