Lavanya Lahari Suicide Case Update: శంషాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్యలహరి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. లావణ్య భర్త వెంకటేష్ కి వివాహేతర సంబంధం నెరుపుతూ లావణ్యకు సోషల్ మీడియాలో దొరికిపోయినట్లు తెలిసింది. ఓ ఎయిర్‌లైన్స్‌లో పని చేసే మహిళా ఉద్యోగినితో వివాహేతర సంబంధం వెంకటేష్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఆమెతో కలిసి జీవిస్తునట్లు తెలుస్తుంది.
మహిళతో విదేశాల్లో తిరిగిన విమాన టికెట్లు, వాట్సాప్ చాటింగ్‌లను లావణ్య తన మొబైల్ లో ఆధారాల కోసం భద్రంగా పెట్టుకున్నట్లు సమాచారం. నిలదీసిన వెంకటేష్ ను చాటింగ్ చూసి భార్య లావణ్య నిలదీయడంతో తర్వాతే అతడి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. భార్య గర్భవతి అని కూడా చూడకుండా గతంలో విచక్షణారహితంగా దాడి చేయడంతో గర్భస్రావం అయినట్లు తెలుస్తోంది. ఆకృత్యాలు భరించలేక అఘాయిత్యం చేసుకునేందుకు పై అంతస్థుకు వెళ్లిన భార్యను అక్కడే ఉన్న వెంకటేశ్వర్‌రావు అడ్డుకోలేదని సమాచారం. వెంకటేష్ వేధింపులుతో లావణ్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.