Revanth Reddy: ఒక వ్యక్తి ధనదాహం కోసం 111జీవో రద్దు.. 111జీవో రద్దు జంటనగరాలపై అణుబాంబు వేసినట్టే..
Revanth Reddy: 111 జీవో కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది.
Revanth Reddy: ఒక వ్యక్తి ధనదాహం కోసం 111జీవో రద్దు.. 111జీవో రద్దు జంటనగరాలపై అణుబాంబు వేసినట్టే..
Revanth Reddy: 111 జీవో కేంద్రంగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా టీ.పీసీసీ చీఫ్ రేవంత్ 111జీవో పై స్పందించారు. ఒక వ్యక్తి ధనదాహం కోసం 111జీవో రద్దు చేశారని మండిపడ్డారు. కేటీఆర్ ఒక మాఫియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని..అనుమతులు ముసుగులో నగరాన్ని ధ్వంసం చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. 111జీవో రద్దు..హిరొషిమా, నాగసాకిలపై అణు దాడి కంటే.. ప్రమాదకరమన్నారు రేవంత్. బందిపోట్లనైనా క్షమించవచ్చు కానీ... కేసీఆర్, కేటీఆర్‌ను క్షమించలేమన్నారు. 111జీవో రద్దుపై కాంగ్రెస్ పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చనిపోయే పరిస్థితి వస్తుందన్నారు.