Khammam: బడ్జెట్ కేటాయింపులో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారంటూ.. PDSU ధర్నా
Khammam: 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్
Khammam: ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కేటాయింపులో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారంటూ ఖమ్మం జిల్లా కేంద్రంలో PDSU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తక్షణమే బడ్జెట్ కేటాయింపులు సవరించి విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తొలి బడ్జెట్ లోనే విద్యారంగానికి కేవలం 7.75 శాతం నిధులు కేటాయించి విద్యార్థులను నిరాశపరిచారని PDSU జాతీయ నేత నాగేశ్వర రావు అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిఫ్ , రియంబర్స్ మెంట్ లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలిపారు.