తెలంగాణలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు రాజకీయాలు...
Telangana News: రైస్ మిల్లర్ల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టిన తెలంగాణ సర్కార్...
Telangana News: తెలంగాణలో ధాన్యం కొనుగోలు రాజకీయాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగి ధాన్యం కొనుగోలు చేస్తోంది. రైస్ మిల్లర్ల ద్వారా ధాన్యం సేకరణలో పడింది. అయితే రైస్ మిల్లుల ద్వారా కొనుగోలు చేపడితే గోల్‌మాల్ జరుగుతుందని కేంద్రం ఆరోపిస్తోంది. దీనిపై FCI ద్వారా ఎంక్వయిరీ చేస్తామని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, సివిల్ సప్లై ఆఫీసులో ధాన్యం కొనుగోలు వడ్ల తేమ ఎగుమతి, దిగుమతి అంశాలపై మంత్రి గంగుల కమలాకర్ తో రైస్ బిల్డర్స్ అసోసియేషన్ యాజమాన్యం సమావేశమైంది.
కేంద్రం వ్యాఖ్యలపై రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మండిపడుతోంది. తమపై ఆరోపణలు సరికాదని రైస్ మిలర్లు అంటున్నారు. వర్షాలు పడుతున్న కారణంగా ధాన్యం తడుస్తుంది. ఈ టైంలో రైతులకు, పరిశ్రమలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ రైస్ మిల్లర్ల ఓనర్స్ తో అన్నారు. ప్రొక్యూర్‌మెంట్ సమర్థవంతంగా చేయాలని మంత్రి సూచించినట్టు రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటివరకు రైస్ మిల్లుల అంశంపై మాట్లాడలేదని, తప్పు నిర్ధారణ కాకముందే మమ్మల్ని దోషిగా నిలబెట్టడం కిషన్ రెడ్డికి మంచిది కాదని రైస్ మిల్లర్ల అసోసియేషన్ అంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే వేల సంఖ్యలో ఉన్న బాయిల్డ్ రైస్ మిల్స్ నష్ట పోకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. రైస్ మిల్లర్స్ సమస్యలపై, నూకలకు నష్టపరిహారంపై ఒక కమిటీ వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రైస్ మిల్లర్స్ అంటున్నారు.