Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
Hyderabad: భారీ వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు
Hyderabad: హైదరాబాద్ నగరంలో కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు పోలీసుల చర్యలు తీసుకున్నారు. నేటి నుండి హైదరాబాద్ సిటీలో భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రైవేట్ బస్సులు, లోకల్ లారీలు, టస్కర్లు డీసీఎంలు, ట్రాలీలపై పోలీసుల ఆంక్షలు అమలవుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.
నేషనల్ పర్మిట్ ఉండి.. అధిక లోడ్ తో వస్తున్న లారీలకు సిటీలోకి అనుమతి ఉండదు. లోకల్ లారీలకి రాత్రి 11 నుండి ఉదయం 7 వరకు అనుమతి ఇస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిపి హెచ్చరించారు.