MP Arvind: బీఆర్ఎస్ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదు

కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్నారు ఎంపీ అర్వింద్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను,మహిళలను మోసం చేసిందన్నారు.

Update: 2024-08-23 07:33 GMT

MP Arvind: బీఆర్ఎస్ను దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదు

Arvind Dharmapuri: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవితను బీజేపీ పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని చెప్పారు. ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని.. కానీ, బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసే రావాలని ఇప్పటికే బండి సంజయ్‌ చెప్పారని ఆయన గుర్తుచేశారు. అలాగే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా హాట్‌ కామెంట్స్‌ చేశారు అర్వింద్. ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారినే రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కాబట్టి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అయినట్లేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందన్నారు ఎంపీ అర్వింద్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను,మహిళలను మోసం చేసిందన్నారు. రూ.2లక్షలు రైతులు చెల్లించాక ప్రభుత్వం మాఫీ చేసేదేంటని ప్రశ్నించారు.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ దక్కిందన్నారు. రేవంత్ రొటేషన్ చక్రవర్తి అని సెటైర్ వేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ చేసినతీరు అభినందనీయమన్నారు అర్వింద్.కేసీఆర్ లాగే రేవంత్ కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News