MLA Poaching Case: కేసీఆర్ అలా చేయడం పట్ల.. సుప్రీంకోర్టుకు న్యాయవాది దవే క్షమాపణలు..

MLA Poaching Case: సమయం ముగియడంతో విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Update: 2023-02-27 12:20 GMT

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ వాయిదా

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సమయం ముగియడంతో విచారణను వాయిదా వేసిన జస్టిస్ గవాయి.. తదుపరి విచారణ తేదీపై ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. శుక్రవారం విచారణకు నిరాకరించగా.. శనివారం నుంచి కోర్టుకు హోళీ సెలవులున్నాయి. దీంతో తదుపరి విచారణ తేదీపై సందిగ్ధత నెలకొంది. అయితే దీనిపై చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు జస్టిస్ గవాయి.

ఇక విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జడ్జిలకు పెన్‌డ్రైవ్‌లు పంపడం సరికాదన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో పెన్‌డ్రైవ్‌లు పంపడంపై ప్రభుత్వ తరపు న్యాయవాది దవే క్షమాపణలు చెప్పారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటంతో సీబీఐ విచారణ పారదర్శకంగా ఉండదని దవే కోర్టుకి తెలపగా.. సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా అని ప్రశ్నించారు జస్టిస్ గవాయి. 

Tags:    

Similar News