ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బస్సులో వైద్య సేవలు
* ఆదిలబాద్, వరంగల్ జిల్లాల్లో మెడికల్ క్యాంపులు * ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రామాలు * ప్రతిమా ఫౌండేషన్ పట్ల ప్రజలు హర్షం
వైద్యం కావాలంటే హాస్పిటల్స్‌కి పరుగులు పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల వారు వైద్యం కోసం కిలోమీటర్ల మేర వెల్లాల్సిన పరిస్థితి. అయితే ఆ జిల్లా వాసులకు మాత్రం.... ఎలాంటి రోగం వచ్చినా గబుక్కున ఓ బస్సు యాదికొస్తుంది. నాలుగు చక్రాలపై ఓ ఆస్పత్రినే మోస్తూ ఓ బస్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తుంది. ఇప్పుడా ఆ బస్ గ్రామీణ ప్రాంతాలకు అనేక సేవలను మోసుకెళ్తుంది.
ఆ బస్ వెంట కార్పోరేట్ స్థాయి వైద్యులు అదే స్థాయిలో మెడిసన్ ఉంటుంది. చూసేందుకు కేవలం చిన్న బస్‌లా కనబడుతున్నా ఇందులో చాలా అద్బుతాలు ఉన్నాయి. డిజిటల్ ఎక్స్ రే ల్యాబ్, క్లినకల్ ల్యాబ్‌తో పాటుగా ఆధునిక టెస్టింగ్ కిట్స్ కూడా ఈ బస్ సొంతం. ఓ హాస్పిటల్‌ని ఈ బస్సు నాలుగు చక్రాలపై తీసుకెళ్తుంది.
ఈ బస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఆదిలబాద్ వరంగల్ జిల్లాలో వైద్య సేవలను అందిస్తోంది. ప్రతిమ ఫౌండేషన్ సభ్యులు గ్రామ స్థాయిలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఈ బస్‌లోనే వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రతిమ ఫౌండేషన్ కి చెందిన ఈ బస్ ద్వారా అనేక గ్రామాల్లో తమ సేవ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రతిమ ఫౌండేషన్ సంస్దకి డాక్టర్ వికాస్ రావు దంపతులు కీలకంగా వ్యవహారిస్తున్నారు. వారితోపాటు వందల మంది సభ్యులు ఈ సేవకార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.
కోవిడ్ సమయంలోనూ ప్రతిమా ఫౌండేషన్ గ్రామాల్లో సేవ కార్యక్రమాలు అందించింది. మారు మూల పల్లెల్లో ఉన్న యువతకి విద్యా కోర్సుల్లో నైపుణ్యత పెంచేందుకు తమ వంతుగా గత కొన్నెల్లుగా అనేక కార్యక్రమాలను చేస్తోంది.
ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతిమా ఫౌండేషన్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు సహకారం అందిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.