ఆదిలాబాద్ జిల్లాలో చేపలతో మసాజ్

Update: 2021-02-07 04:33 GMT

Massage With Fish

సాధారణంగా మనుషులు తైలంతో లేదా ఎలక్ట్రానిక్ పరికరాలతో మసాజ్‌లను చేయడం తెలుసు కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా చేపలతో మసాజ్ చేస్తున్నారు ఇదేంటి అనుకుంటున్నారా ఇది నిజమండి ఇంతకీ ఆ మసాజ్ ఎక్కడ చేస్తున్నారు అనేదే కదా మీ సందేహం అయితే మనం ఆ గ్రామానికి వెళ్లాల్సిందే.

షేక్ అన్వర్, షేక్ ఫిరోజ్ వీళ్లిద్దరు అన్నదమ్ములు. వీరిది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ. వీరికి చేపల పెంపకమంటే ఇష్టమట. ఇదే క్రమంలో మొదట వారు కొన్ని చేపలను తీసుకొచ్చి మట్టి కుండల్లో పెంచడం మొదలు పెట్టారు. అనుకోకుండా ఆ కుండలో అప్పుడప్పుడు చేతులు కాళ్ళు పెట్టేవారట. అయితే ఓ 15 నిమిషాల పాటు అలాగే ఉంచితే అవి కాళ్ళ చుట్టూ చేరి పాదాల మృత చర్మాన్ని శుభ్రం చేస్తాయట వీటివల్ల రక్తప్రసరణ మానసిక ప్రశాంతత పాటు చర్మాన్ని మృదువుగా మార్చడం, కాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలగడం వంటి ప్రయోజనాలు ఉంటాయని గ్రహించారట ఈ బ్రదర్స్. అంతే కాదు దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో ఇలా చేపల ద్వారా మసాజ్ కూడా చేయించుకుంటారని ఇతరుల ద్వారా తెలుసుకున్న ఈ అన్నదమ్ములకు వెంటనే ఓ ఆలోచన తట్టిందట. అంతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ ఆలోచనను ఇలా ఆచరణలో పెట్టేశారు.

ఇలా కొన్ని రోజులు తమ ఫ్రెండ్స్ తో పాటు మరికొంత మందికి ఈ సమాచారం వెళ్లడంతో వారు ఇక్కడికి వచ్చి మసాజ్ చేయించుకున్నారట. దీంతో అది వారికి ఉపాధితో పాటు ఓ వ్యాపారంగా మారిపోయింది. అంతకు ముందు కేవలం హైదరాబాద్, బెంగళూర్, ముంబై, ఢిల్లీ, కలకత్తా లాంటి పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఇలాంటి మసాజ్ సెంటర్లు ఇప్పుడు.. ఇచ్చోడ లాంటి గ్రామాలకు విస్తరించడంతో జనం ఈ మసాజ్ పట్ల ఆసక్తిని చూపుతున్నారు  

Tags:    

Similar News