ఆదిలాబాద్ కొద్ది రోజులుగా వింత వాతావరణం ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. రాత్రి వేళ విపరీతంగా చలి పెడుతుంది. పగటి పూట ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఈ తరహా ఎండలు ఉంటే ఏప్రిల్ లో పరిస్థితి ఎలా ఉంటుందని జనం ఆందోళన చెందుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో విభిన్నవాతావరణం ఉంటుంది. ఈ జిల్లాలో సీజన్ ను బట్టి వర్షాలు, చలి, ఎండలు అన్నీ ఎక్కువే. అయితే, గత పది రోజులుగా రాత్రి వేళ ఎముకలు కొరికే చలి, పగటి పూట ఎండలు మండిపోతున్నాయి.
గత పది రోజులుగా పగటి పూట పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం పరేషన్ అవుతున్నారు. ఒకేసారి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరుకోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
ఆదిలాబాద్ లో ఎన్నడూలేని విధంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. తీవ్ర ఎండలతో వృద్ధులు, పిల్లలు ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విచిత్ర వాతావరణంతో పరేషన్ అవుతున్న ఆదిలాబాద్ వాసులు ఎండకాలం తీవ్రత తలచుకుని హడలిపోతున్నారు.