Adilabad: కుంటాల జలపాతంలో శివయ్య ఆలయం

Adilabad: సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగం * 100 అడుగుల ఎత్తులో ఉన్న ఆలయం

Update: 2021-03-11 10:57 GMT

కుంతలా జలపాతంలోని శివాలయం (ఫైల్ ఫోటో)

Adilabad: మహాశివరాత్రి సందర్భంగా దేవదేవుని దర్శనం కోసం ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే.. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతం దగ్గర ఉన్న శివుడిని దర్శించుకోవాలంటే చిన్నపాటి సాహసం చేయాల్సిందే. దాదాపు 100 అడుగుల ఎత్తులో సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో స్వయంభుగా వెలసిన సోమేశ్వరుడి దర్శించుకునేందుకు ట్రెక్కింగ్ చేస్తూ వెళుతున్నారు భక్తులు. చుట్టూ ఎత్తైన కొండలు, గుట్టలు ఉన్నప్పటికీ శివనామస్మరణ చేసుకుంటూ సునాయాసంగా పరమేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.

Tags:    

Similar News