సెట్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు
కోవిడ్ 19 ప్రభావంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.
కోవిడ్ 19 ప్రభావంతో రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈనెల 20 వరకు పొడిగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నడుస్తుందని, అందుకే గడువును పొడిగించామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి బుధవారం వెల్లడించారు.
దాంతో పాటుగానే మే 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నాఎంసెట్- 2020, మే 2న నిర్వహించనున్న ఈసెట్‌ను- 2020 పరీక్షలు కూడా వాయిదా పడనున్నాయని వారు తెలిపారు. వాటితో పాటు పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీలాసెట్, ఎడ్‌సెట్ దరఖాస్తుల గడువులను కూడా పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ నెల 30వ తేది వరకు ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందన్నారు.
ఎంసెట్ దరఖాస్తుల షెడ్యూల్:
♦ దరఖాస్తుల స్వీకరణకు గడువు : ఏప్రిల్ 20
♦ రూ. 500 ఆలస్య రుసుముతో గడువు : ఏప్రిల్ 22
♦ రూ.1000 ఆలస్య రుసుముతో గడువు : 24
♦ రూ.5000 ఆలస్య రుసుముతో గడువు : ఏప్రిల్ 27
♦ రూ.10 వేలు ఆలస్య రుసుముతో గడువు : ఏప్రిల్ 29
♦ హాల్ టికెట్లు ఏప్రిల్ 24 – మే 1 అందుబాటులో ఉంటాయి.