Jagga Reddy: సీఎల్పీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి
Jagga Reddy: నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా... వద్దన్నారు కాబట్టే వెళ్లిపోతున్నా
సీఎల్పీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి
Jagga Reddy: సీఎల్పీ సమావేశాన్ని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్‌కాట్ చేశారు. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నానని వద్దన్నారు అందుకే వెళ్లిపోతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. తనకు చేదు అనుభవం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని స్పష్టం చేశారు. తనను అవమానించే దమ్ము ఎవరికి లేదన్నారు. భట్టి, కుసుమ కుమార్ ఇద్దరు మాట్లాడవద్దని కోరారు. అందుకే మాట్లాడలేదని, మీటింగ్‌కు అంతరాయం కలుగొద్దనే సమావేశంలో ఉండడం లేదన్నారు జగ్గారెడ్డి.