Telangana: తెలంగాణలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Telangana: తూర్పు దిశ‌నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా 39 డిగ్రీలుగానమోదవుతున్నాయి

Update: 2021-03-04 02:55 GMT

Representational Image

Telangana: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తూర్పు దిశ‌నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని రోజులుగా 39 డిగ్రీలుగానమోదవుతున్నాయి. బుధ‌వారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ము‌గూ‌డెంలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత రికార్డయింది. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణో‌గ్రతలు 35.5 డిగ్రీల నుంచి 39.5 డిగ్రీల మధ్య నమో‌ద‌య్యా‌యని టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచి‌ర్యాల జిల్లాల్లో 39 డిగ్రీ‌ల‌కు‌పైనే ఉష్ణోగ్రతలు నమో‌ద‌య్యాయి.

గాలిలో తేమ 27 నుంచి 82 శాతం వరకు నమో‌ద‌వు‌తు‌న్నాయి. ఆది‌లా‌బాద్‌ జిల్లా అర్లి‌లో 13.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత రికార్డయింది. గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. నగ‌రంలో కనిష్ఠ ఉష్ణో‌గ్రత 20 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణో‌గ్రత 36 డిగ్రీ‌లుగా నమో‌దైంది. రాత్రి సమ‌యంలో ఉక్కపోత ఎక్కు‌వగా ఉంటుంది.

Tags:    

Similar News