Hyderabad: పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం
Hyderabad: 1000 కేజీల డిటోనేటర్ పదార్థాలు స్వాధీనం * హైదరాబాద్ కేంద్రంగా కరీంనగర్, ఖమ్మంలోని
Detonator Materials Manufacturing Center
Hyderabad: పాతబస్తీలో హైదరాబాద్ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, కరీంనగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రంపై దాడులకు దిగారు. తనిఖీల్లో వెయ్యి కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కరీంనగర్, ఖమ్మంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు డిటోనేటర్ పేలుడు పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. శ్రీరామ, హెచ్‌ఎంటీ ట్రాన్స్‌పోర్టులో సోదాలు చేపట్టి.. పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.