Bhuma Akhila Priya: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త పై మరో కేసు
Bhuma Akhila Priya: మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త, సోదరుడి పై మరో కేసు నమోదు అయ్యింది.

Bhuma Akhila Priya & Bhargav Ram
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తో పాటు సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై బోయిన్‌పల్లి పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లి లో ప్రవీణ్ రావు తో పాటు ఆయ న సోదరుల కిడ్నాప్ కేసులో వీరిద్దరూ ఈ నెల 3న కోర్టులో హాజరు కావాల్సి వుంది. అయితే కరోనా కారణంగా విచారణకు హాజరు కాలేమని ఈ నెల 1న కోర్టులో నకిలీ ధ్రువపత్రం సమర్పించినట్లు అభియోగం నమోదైంది.
భార్గవ్ రామ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు సమర్పించిన కోవిడ్ సర్టిఫికెట్ జారీ చేసిన ఆసుపత్రికి వెళ్లి విచారణ నిర్వహిస్తే అసలు విషయం తేలింది. ఈ కోవిడ్ సర్టిఫికెట్ తాము జారీ చేయలేదని ఆసుపత్రి తేల్చి చెప్పడంతో బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ కోవిడ్ సర్టిఫికెట్ జారీ చేసిన ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లి ప్రవీణ్ రావు తో పాటు ఆయ న సోదరుల కిడ్నాప్ కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగద్విఖ్యాత రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.