రేపే GHMC పోలింగ్‌

Update: 2020-11-30 14:11 GMT

రేపే జీహెచ్ఎంసీ పోలింగ్.. గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు.. 1,112 మంది అభ్యర్థులు..74లక్షల 67వేల 256మంది ఓటర్లు.. గ్రేటర్‌ వాసులు తమ ఓటు హక్కుతో తమ పాలకులెవరో డిసైడ్‌ చేయనున్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఈసారి బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మాస్క్‌ ఉంటేనే ఓటర్లకు బూత్‌లోకి ఎంట్రీ ఉంటుందని ఈసీ ఇప్పటికే ప్రకటించారు.

ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. 48వేల మంది పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు 52వేల 5వందల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్స్ ఏర్పాటు చేశారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 30 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు ఎలక్షన్‌ డ్యూటీ చేయనున్నాయి.

గ్రేటర్ ఎన్నికల కోసం మొత్తం 2వేల 9వందల 37 లొకేషన్లలో 9వేల 101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 2,336 సున్నితమైన కేంద్రాలు.. 1,207 అతి సున్నితమైన కేంద్రాలు, 279 క్రిటికల్‌ కేంద్రాలు గా ఈసీ గుర్తించింది. పరిస్థితులకు అనుగూణంగా ఇందులో మార్పులు చేర్పులు జరుగవచ్చని ఈసీ వెల్లడించారు. 

Tags:    

Similar News