Telangana: హైకోర్టు సంచలన తీర్పు.. కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు..
Telangana: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Telangana: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావుకు ₹5లక్షల జరిమానా విధించింది.