TS: తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు
TS: ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు
TS: ఒకే రోజు మూడు పార్టీల సభలు.. యస్..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. రేపు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది. ఈ సభ వేదికగానే...మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.. ఇక అదే రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్.. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి..
కాంగ్రెస్ మూడు నెలల పాలన, కేంద్ర ప్రభుత్వ విధానాలను కేసీఆర్ టార్గెట్ చేసే అవకాశముంది.. ఇదిలా ఉంటే.. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తున్న కమలదళం..అందుకనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతోంది.. ఈ క్రమంలోనే అమిత్ షా రేపు తెలంగాణకు రానున్నారు. మొదట సోషల్ మీడియా వారియర్స్‌తో..ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో..బూత్ స్థాయి అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా.