MLC Kavitha: ఇవాళ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

MLC Kavitha: ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కవిత పిటిషన్‌

Update: 2024-03-22 03:44 GMT

MLC Kavitha: ఇవాళ కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ మరింత దూకుడు పెంచింది. కస్టడీ విచారణలో కీలక విషయాలను రాబట్టే పనిలో ఉంది. మరోవైపు తనని అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఈడీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే అరెస్ట్ ఈడీ అరెస్ట్ చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు రాకుండానే…ఈడీ. అరెస్ట్ చేసిందని కవిత గుర్తు చేశారు. ఈడీ చర్యలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని… ఈ కేసులో తన అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

Tags:    

Similar News