Harish Rao: ఈటల రాజీనామా సొంత లాభం కోసమే
Harish Rao: తన సొంత ప్రయోజనాల కోసం రాజీనామా చేశారు * 2లక్షల మందికి మేలు జరగడం ముఖ్యమో ప్రజలు నిర్ణయించుకోవాలి
Harish Rao: ఈటల రాజేందర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి హరీష్‌రావు. ఈటల రాజేందర్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారే కానీ.. హుజూరాబాద్ ప్రజల ప్రయోజనాలకోసం కాదని ఆరోపించారు. ఒకవేళ హుజూరాబాద్‌లో ఈటల గెలిస్తే వ్యక్తిగా తనకే లాభం తప్ప ప్రజలకు ఎలాంటి లాభం ఉండదని అన్నారు. ఒక వ్యక్తి యొక్క స్వలాభం ముఖ్యమో రెండు లక్షల 29వేల మంది హుజూరాబాద్ ప్రజలకు మేలు జరగడం ముఖ్యమో ఆలోచించుకోవాలన్నారు హరీష్‌రావు.
ఈటలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే తనపై కూడా అవాకులు, చవాకులు పేలుతున్నారని అన్నారు హరీష్. తానేంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. మాట మీద నిలబడుతూ, పేద ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టే ఆరుసార్లు భారీ మెజార్టీతో తన నియోజకవర్గ ప్రజలు గెలిపించారని చెప్పారు. ఆరుసార్లు పోటే చేస్తే ఐదుసార్లు ప్రత్యర్థుల డిపాజిట్లే గల్లంతయ్యాయని గుర్తు చేశారు హరీష్.