Ration Card: రేషన్ కార్డులున్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..అందుబాటులోకి గ్రెయిన్ ఏటీఎంలు
Ration Card: తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఎంతో మంది ప్రయోజనం చేకూరుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ration Card:తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరే వార్త అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం.త్వరలోనే ప్రభుత్వం కొత్త సర్వీసునుల అందుబాటులోకి తీసుకురాబోతంది. దీంతో ఎంతో మంది రేషన్ కార్డు లబ్దిదారులకు ఊరట లభించనుంది.ప్రభుత్వం తీసుకువస్తున్న సేవలు ఏంటీ..ఎవరి ఉపయోగకరంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీంతో రేషన్ కార్డు ఉన్నవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వలసదారులు, లబ్దిదారుల రేషన్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పరిధిలో ముందుగా ఈ కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. గ్రెయిన్ ఏటీఎంలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గ్రెయిన్ ఏటీఎం అంటే ఏంటనే కదా మీ డౌట్. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ గ్రెయిన్ ఏటీఎం ద్వారా లబ్దిదారులు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. 24గంటల పాటు 365రోజుల పాటు రేషన్ పొందేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. సాధారణ లబ్దిదారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇతర రాష్ట్రాల వారు కూడా మన రాష్ట్రంలో రేషన్ తీసుకోవచ్చు.
అయితే ఈ గ్రేయిన్ ఏటీఎం ద్వారా వలస వచ్చినవారికి రేషన్ తీసుకోవచ్చు. ఇది అందరికీ సానుకూల విషయమేనని చెప్పవచ్చు. వలసదారులు ఎక్కువగా ఉండే రైస్ మిల్లులు ఉన్న ప్రాంతాలు, పనిచేసే ప్రదేశాల్లో మొదట గ్రెయిన్ ఏటీఎం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఓడిశా రాష్ట్రంలో ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. వీటి ద్వారానే రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.