మంత్రి కేటీఆర్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా ఎమర్జేన్సీ అలర్ట్.. షాక్ అయిన మంత్రి
KTR: ఫైర్ అలారం ఏమైనా వచ్చిందా అని కంగారుపడ్డ కేటీఆర్
KTR: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో ఇవాళ ఎమర్జెన్సీ అలర్ట్ మోగింది. కాసేపటి వరకు ఆ అలారం మోగుతూనే ఉండటంతో యూజర్లంతా కంగారు పడ్డారు. ఒక్కసారిగా అన్ని ఫోన్ల నుంచి అలారం మోగడం.. ఆపే వరకు ఆ అలారం మోగుతూనే ఉండటం... అసలు ఫోన్ అలా ఎందుకు మోగుతుందో తెలియని అయోమయంతో యూజర్లు టెన్షన్ పడ్డారు. మంత్రి కేటీఆర్ మీటింగ్ జరుగుతుండగా ఒక్కసారి ఎమర్జెన్సీ అలర్ట్ మోగింది. దీంతో ఫైర్ అలారం ఏమైనా వచ్చిందా మంత్రి కేటీఆర్ కాస్తా కంగారుపడ్డారు. మొబైల్ ఎమర్జెన్సీ అలర్ట్ అని తెలుసుకోవడంతో అక్కడ ఉన్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.