Telangana: తెలంగాణలో వేప చెట్లకు పొంచి ఉన్న ప్రమాదం

Telangana: నాటితరం నుండి నేటి తరం వరకూ ఎంతో ప్రాధాన్యత కలిగింది వేప చెట్టు.

Update: 2021-10-24 09:58 GMT

Telangana: తెలంగాణలో వేప చెట్లకు పొంచి ఉన్న ప్రమాదం

Telangana: నాటితరం నుండి నేటి తరం వరకూ ఎంతో ప్రాధాన్యత కలిగింది వేప చెట్టు. దాని చిగుళ్లు, ఆకులను మందుల తయారీలో వాడుతుంటారు. చాలా మందుల్లో, ముఖ్యంగా డయాబెటిస్ నివారణకు ఎంతగానో తోడ్పడుతుంది. చీడపీడల మీద జీవాయుధంగా ప్రయోగించే అంతటి వేప చెట్టుకు ఇప్పుడు పెను ప్రమాదం ముంచుకోస్తుంది. వరంగల్ జిల్లాలో వేప చెట్లు డైబ్యాక్ అనే డిసీస్‌తో ఎండిపోతున్న వైనంపై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం.

ఎంతో విశిష్టత కలిగిన వేప చెట్లకు తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదం పొంచి ఉంది. వరంగల్‌ జిల్లాలోని వేప చెట్లకు డైబ్యాక్ అనే కొత్త వ్యాధి సోకుతుంది. మొదట ఈ వ్యాధి సోకిన వేప చెట్టు ఆకులు మొత్తం రాలి, చెట్టు ఎండిపోయి, మొత్తానికి చనిపోతుంది. అయితే ఈ వ్యాధి ఫస్ట్ కర్ణాటకలో వెలుగు చూడగా ప్రస్తుతం తెలంగాణలో వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధిని వేరు కుళ్లు వ్యాధి అని కూడా అంటారు. మొదట ఈ వ్యాధి వెళ్లను చంపేస్తుందని అలా పిలుస్తారు.

మన దేశంలో వేప చెట్లకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన వేప చెట్లు ఇతర దేశాల మందుల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. అలాంటి వేప చెట్లు ఇప్పుడు క్రమంగా అంతరించి పోయే ప్రమాదం నెలకొంది. డైబ్యాక్ వ్యాధికి నివారణ భావీస్టన్ అనే గ్రామ్ మందును 8 లీటర్స్ నీళ్ళల్లో కలిపి ఇంజక్షన్ ద్వారా చెట్టుకు వేయడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది. లేకపోతే నాలుగు నుండి ఐదు వారాల లోపు వేప చెట్టు పూర్తిగా చచ్చిపోతుంది. పచ్చని పల్లెటూళ్లలో చల్లని నీడనిస్తాయి వేప చెట్లు. అలాంటి వేప చెట్లను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఏదేమైనా ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ ఎంతో ప్రాముఖ్యత కలిగిన వేప చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.

Tags:    

Similar News