HYD News: అక్రమ నిర్మాణాలు కూల్చివేత
HYD News: ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడికి సంబంధించిన అక్రమ షెడ్లు కూల్చివేత
HYD News: హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అనుమతులు లేకుండా రేకుల షడ్లు నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మేడ్చల్ డిపోకు ఎదురుగా నిర్మించిన రేకుల షెడ్లను టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదుతోనే ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన అక్రమనిర్మాణాలు కూల్చివేతలు జరుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు.