Bhadrachalam Ramalayam: దేవుని పేరిట మోసం..సామాన్యులను వదలని సైబర్ నేరగాళ్లు..

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

Update: 2020-06-25 06:29 GMT

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కొంత మంది ఆన్ లైన్ ద్వారా ప్రజలను మోసం చేసి వారి డబ్బులను కాజేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఆ దేవున్ని కూడా వదలడం లేదు. దేవుని పేరు చెప్పుకుని మోసం చేసి డబ్బును దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే కాస్త ఆలస్యంగా బహిర్గమైంది. భద్రాద్రి రాముడి పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించి డబ్బులు కొట్టేస్తున్న వైనం ఇటీవల వెలుగు చూసింది.

అసలు ఈ ఘరానా మోసం ఎలా బయటపడిందో పూర్తివివరాల్లోకెళ్తే వరంగల్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ అనే ఓ వ్యక్తి ఈ మధ్య కాలంలో భద్రాచలం రామాలయం పేరిట ఓ పేజిని వికిపీడియాలో ఓపెన్ చేశాడు. ఆ తరువాత అదే పేజీలో ఉన్న లింక్ ద్వారా భద్రాచలం రామాలయం వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేశాడు. అనంతరం భద్రాద్రి రామాలయంలో పూజల కోసం ఆన్ లైన్ లో నగదు చెల్లించాలనుకున్నాడు. ఆ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం గూగుల్ పే ద్వారా డబ్బులను చెల్లించాడు. డబ్బులు రిసీవ్ అవ్వగానే ఆ వ్యక్తికి వచ్చిన వివరాలను పరిశీలిస్తే గూగుల్ పే ఐఎఫ్ఎస్‌సీ కోడ్ జనగామ జిల్లా పాలకూర్తి ఎస్‌బీహెచ్ బ్రాంచ్ అని చూపించింది.

దీంతో ఓ వ్యక్తికి అనుమానం కలిగింది. కాగా ఆ వ్యక్తి వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసాడు. పోలీసుల సాయంతో కూపీ లాగాడు. దీంతో అసలు నిజం బయట పడింది. కూపీలో దొరికి ఫోన్ నంబర్ ఆధారంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు భద్రాద్రి రాముడి పేరిట ఆ యువకుడు భక్తులను మోసం చేస్తున్నాడని గుర్తించి సంబంధిత సమాచారాన్ని ఆలయ ఈవో దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన పూర్తి ఆధారాలను సేకరించి భద్రాచలం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.


Tags:    

Similar News