VH: రేవంత్.. నీ స్థాయిని నువ్వే తగ్గించుకోకు..!
V Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతల చేరికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత్ రావు.
V Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతల చేరికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత వీ. హనుమంత్ రావు. ప్రజలు BRSను వద్దని కాంగ్రెస్‌ను గెలుపించారు. మళ్ళీ వాళ్ళను మన పార్టీలో జాయిన్ చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. నువ్వు ముఖ్యమంత్రివి, వాళ్ళు నీ దగ్గరికి రావాలి కానీ నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం కరెక్ట్ కాదన్నారు. నీ స్థాయిని నువ్వే తగ్గించుకుంటున్నావు ఆలోచన చేసుకో అని సూచించారు వీహెచ్. BRS వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంటే మన పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారన్నారు. రేవంత్.. ఒక్క సైడ్ వినకు, రెండు సైడ్స్ వినాలన్నారు. తాను మీకు వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేదే తన ఆవేదన అన్నారు వీహెచ్.