Congress Leader V. Hanumantha Rao: కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వీహెచ్‌ దంపతులు

Congress Leader V. Hanumantha Rao: తెలంగాణలో కరోనా వైరస్ కేసులులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే..

Update: 2020-07-01 15:45 GMT

Congress Leader V. Hanumantha Rao: తెలంగాణలో కరోనా వైరస్ కేసులులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. దాదాపుగా రోజుకు 800 పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనా సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి సోకుతూ మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది.. ఇప్పటికే తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు దంపతుల కూడా కరోనా సోకింది.. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వీహెచ్‌ దంపతులు చేరారు. గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో నెగెటివ్ అని వచ్చింది. దీనితో బుధవారం దంపతులిద్దరినీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వస్తే.. మంగళవారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం... గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 945 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 16,339కి చేరింది. ప్రస్తుతం ఇందులో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా, 7,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇవ్వాలా 1,712 మంది డిశ్చార్జ్ కాగా, ఏడుగురూ మృతి చెందారు.

ఒక్క GHMC పరిధిలోనే కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది.. దీనితో గ్రేటర్ హైదరాబాద్ లో మరో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు గత ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి, నివారణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు చికిత్స అందిస్తోన్న తీరు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. ఇందులో అధికారులు హైదరాబాద్ లో 15 రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని నివేదించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించేందుకు విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News