Congress: మరో 4సీట్లను పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్

Congress: సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్

Update: 2023-11-07 15:45 GMT
Congress Has Left 4 More Seats Pending

Congress: మరో 4సీట్లను పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్

  • whatsapp icon

Congress: అభ్యర్థుల ప్రకటనలో కాంగ్రెస్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. మొత్తం 119 స్థానాలకు 114నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను ప్రకటించిన హస్తం పార్టీ మరో నాలుగు సీట్లను పెండింగ్‌లో పెట్టింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ స్థానంతో పాటు చార్మినార్ స్థానానికి అభ‌్యర్థిని ఫైనల్ చేయలేదు. చార్మినార్ మినహాలో పెండింగ్‌లో ఉన్న మూడు స్థానాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవే కావడం గమనార్హం. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు లేరని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందా లేక నేతల మధ్య అంతర్గత పోటీతో ప్రకటనను పెండింగ్‌లో పెట్టిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

సూర్యాపేటలో మాజీ మంత్రి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి మధ్య టికెట్ ఫైట్ ఉంది. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో హైకమాండ్ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. సూర్యాపేటకు పక్కనే ఉన్న తుంగతుర్తిలో కూడా టికెట్ ప్రకటన రాలేదు. తుంగతుర్తిలో పిడమర్తి రవి, అద్దంకి దయాకర్, మందుల సామేల్, మోత్కుపల్లి నర్సింలు, డాక్టర్ వడ్డేపల్లి రవిలు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి వరకు అద్దంకి దయాకర్‌కే టికెట్ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ సడెన్‌గా కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి ఎంట్రీ ఇవ్వడంతో సిచ్యువేషన్ మారిపోయింది. మోత్కుపల్లి కూడా తుంగతుర్తి సీటును ఆశిస్తుండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే సందిగ్ధంలో ఉందట కాంగ్రెస్ పార్టీ. అద్దంకి దయాకర్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య విభేదాలు ఉండటం, మోత్కుపల్లికి ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారనే వార్తలు వస్తున్నాయి. పైగా తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడ్ కావడంతో.. అభ్యర్థులందరికి ఆర్ధిక సమస్యలు ఉన్నాయని‌, అక్కడ ఎన్నికల ఖర్చు ఎవరు పెట్టాలనే దానిపైనే కసరత్తు జరుగుతుందట.

ఇక మిర్యాలగూడలో కాంగ్రెస్ టికెట్ కోసం బత్తుల లక్ష్మారెడ్డి, జానారెడ్డి కుటుంబం మధ్య పోటీ ఉంది. సీపీఎంతో పొత్తు కుదరకపోవడంతో ఇక్కడి నుంచి మాజీ ఎమ్యెల్యే జూలకంటి పోటీ చేయబోతున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే..కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతుందట కాంగ్రెస్. ఒకవేళ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తే జానారెడ్డి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది. ఆయనకు సపోర్ట్ చేస్తారా లేక అభ్యంతరం వ్యక్తం చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండలోని పెండింగ్ సీట్లతో హస్తం పార్టీ నరాజ్ అవుతుందట.

Tags:    

Similar News