ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి
Telangana Assembly: పార్టీ మారిన వాళ్లకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చిందని.... కానీ, తమ పార్టీ మాత్రం పార్టీ మారినవారికి ఎలాంటి పదవులు ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

బుధవారం తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. 2014 నుంచి ఒకే చట్టం ఉంది. అప్పటికి ఇప్పటికి చట్టంలో ఎలాంటి మార్పులు రాలేదని ఆయన గుర్తు చేశారు. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్పారని ఆయన ప్రస్తావించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టినా కూడా వారిపై ఎలాంటి అనర్హత వేటు పడలేదు... ఉపఎన్నికలు రాలేదన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు.
వచ్చే వారమే ఉప ఎన్నికలు ఎలా వస్తాయని ఆయన అడిగారు. చట్టం, న్యాయం,స్పీకర్ కార్యాలయం, రాజ్యాంగం మారలేదని..ఇప్పుడు ఉపఎన్నికలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం... గత అనుభవాల దృష్ట్యా ఉప ఎన్నికలు రావని సీఎం వివరించారు.