Revanth Reddy: తెలంగాణ తల్లి రూపంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపులేదన్నారు. అలాంటి గుర్తింపు ఇవ్వాలనే మన సంప్రదాయాలు.. సంస్కృతి ఉట్టి పడేలే తెలంగాణ తల్లిని రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
చరిత్రకి దర్పంగా పీఠాన్ని రూపొందించామన్నారు. తెలంగాణ తల్లి వేరు.. దేవత వేరు. ఏ తల్లికి కిరీటం ఉందు.. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభత్వం ఆవిష్కరిస్తున్నదని చెప్పారు. తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా..ఈ విషయాన్ని జనాలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని అన్నారు.