Kanti Velugu: తెలంగాణలో నేటి నుంచి రెండో దఫా కంటివెలుగు ప్రారంభం

Kanti Velugu: కాసేపట్లో అమీర్‌పేట్‌లో ప్రారంభించనున్న మంత్రులు హరీష్‌, తలసాని

Update: 2023-01-19 04:01 GMT

Kanti Velugu: ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

Kanti Velugu: తెలంగాణలో నేటి నుంచి రెండో దఫా కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కాసేపట్లో అమీర్‌పేట్‌లో కంటివెలుగు కార్యక్రమాన్ని మంత్రులు హరీష్‌రావు, తలసాని ప్రారంభించనున్నారు. ఇక ఇప్పటికే దీని కోసం అన్ని జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల పాటు కంటివెలుగు కార్యక్రమం జరగనుంది. 1500 బృందాలతో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక కంటి పరీక్షలకు వచ్చేవారికి ఆధార్‌ కార్డ్‌ను తప్పనిసరి చేశారు. నిన్న ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ, పంజాబ్‌, కేరళ సీఎంలు, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ పలువురికి తమ చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. 

Tags:    

Similar News