KTR: కాంగ్రెస్‌పై ఎక్స్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
KTR: దొంగ హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది
KTR: కాంగ్రెస్‌పై ఎక్స్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
KTR: ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్‌పై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాంకేతిక కారణాలతో పెన్షన్‌దారులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలికి వచ్చిన పెన్షన్ రికవరీ నోటీస్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు కేటీఆర్. పక్షవాతంతో బాధపడుతున్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలని.. లేదంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్‌పై తిరగబడతారని హెచ్చరించారు కేటీఆర్.