Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపడం లేదు..
Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా వివక్ష చూపడం లేదు..
Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సరిసమానంగా నిధులు అందిస్తోందని, ఏ రాష్ట్రానికి వివక్ష చూపడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను వంద శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారాయన... కేంద్ర ప్రభుత్వం పాలసీల నిర్ణయం తీసుకున్నప్పుడు.. తెలంగాణకు న్యాయబద్దంగా... చట్టబద్దంగా రావాల్సిన నిధులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు రఘునందన్ రావు. తెలంగాణ నుంచి వెళుతున్న పన్నులన్నీ నిధుల రూపంలో తెలంగాణకే వస్తున్నాయా.. అని కొందరు బయట, అసెంబ్లీలో కూడా విమర్శిస్తున్నారని అన్నారు.