కూకట్‌ పల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు.. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటల్లో కవిత

*ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇంటిప్రాంగణంలో బతుకమ్మ సందడి

Update: 2022-10-04 01:25 GMT
Bathukamma Celebrations in Kukatpally

కూకట్‌ పల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు

  • whatsapp icon

Kukatpally: రంగు రంగుల పూలు బతుకమ్మరూపాన్ని సంతరించుకున్నాయి. సద్దుల బతుకమ్మగా జలనిమజ్జనానికి వరుసకట్టాయి. పుట్టింటినుంచి ఆడబిడ్డను అత్తారింటికి పంపినట్టు... సద్దులు కట్టి గౌరమ్మను సాంప్రదాయ బద్దంగా సాగనంపారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గృహపరిసరాలు బతుకమ్మ సంబరాలతో ప్రత్యేక వాతావరణంతో సందడిగా మారింది. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సద్దుల బతుకమ్మసంబరాల్లో పాలుపంచుకున్నారు. పూలను బతుకమ్మగా తీర్చిదిద్ది, గౌరమ్మను ఆరాధించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సందడిచేశారు.

Tags:    

Similar News