Amit Shah: కేసీఆర్‌ను గద్దె దించేందుకు నేను రానక్కరలేదు.. బండి సంజయ్ ఒక్కడు చాలు..
Amit Shah: తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాల్సిన సమయం వచ్చిందన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
Amit Shah: తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించాల్సిన సమయం వచ్చిందన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అందుకోసం తాను తెలంగాణకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు బండి సంజయ్ ఒక్కడే చాలని షా కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ శివారు తుక్కుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణలో వారసత్వ రాజకీయాలు పరాకాష్టకు చేరాయని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలను సాధిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ హామీని నిలబెట్టుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందని షా స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనను సాగనంపేందుకు తెలంగాణ యువత సిద్ధంగా ఉందని షా తెలిపారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనలేకపోతే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.