భూపాలపల్లి జిల్లాలో రోడ్డెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థినులు
Bhupalpalli: ప్రిన్సిపల్ చైతన్య ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపణ
Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ చైతన్య తమను ఇబ్బందులకు గురిచేస్తోందని, తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ.. కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రిన్సిపల్ చైతన్యను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించారు. అయితే.. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా.. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.