శ్రీశైలం పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

Update: 2020-10-24 11:31 GMT

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఆగస్టు 20న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి దాదాపు 900 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పాదనకు విఘాతం ఏర్పడింది. అయితే తాజాగా మూడు నెలల తరువాత విద్యుత్

ఉత్పత్తి ప్రారంభం అయింది. రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తి ప్రారంభించారు తెలంగాణా జెన్ కో అధికారులు. మిగిలిన 4 యూనిట్ లలో కూడా త్వరలో ట్రయల్ రన్ చేయనున్న అధికారులు వాటిని కూడా పునరుద్దరించి వాటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. అయితే ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రెండు యూనిట్స్ కి గత నెలలో ట్రయల్ రన్ విజయవంతం అయింది.

గతంలో అగ్ని ప్రమాదం జరిగిన శ్రీశైలంలోని భూగర్భ జలవిద్యుత్కేంద్రాన్ని టీఎస్‌ జెన్‌కో నిపుణుల కమిటీ పరిశీలించింది. ప్రధానంగా ప్రమాదానికి రెండే కారణాలని ప్రాథమిక విచారణలో తేలింది. రెండేళ్ల కిందటే బ్యాటరీల జీవితకాలం పూర్తయినా మార్చేందుకు చీఫ్‌ ఇంజనీర్‌ అడ్డు తగలడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణాలని గుర్తించారు. ప్యానల్‌ బోర్డులకు నేరుగా కరెంట్‌ సరఫరా చేసే బ్యాటరీలను బిగించే సమయంలో ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి నిలిపివేస్తామని క్షేత్రస్థాయి సిబ్బంది నివేదించినా స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ నిరాకరించడం కూడా ఒక కారణం అని వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున పొగలు రావడంతో అందులో చిక్కుకొని తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పాయారు. ఒకటి, రెండవ యూనిట్లలో ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగనప్పటికీ రెండు యూనిట్ లు అందుబాటులోకి రావడానికి రెండు నెలల సమయం పట్టింది.

Tags:    

Similar News