Mulugu: ములుగు జిల్లా ఏటూరు నాగారం రహదారిపై ప్రమాదం
Mulugu: ఆటోను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం, ముగ్గురు మృతి
Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తోన్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తరలించారు. మృతులను వాజేడు మండల వాసులుగా గుర్తించారు.