6 Guarantees: 6 గ్యారంటీస్ అమలు దిశగా రేవంత్ సర్కార్ అడుగులు.. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు
6 Guarantees: రేషన్ కార్డులే ప్రామాణికంగా గ్యారంటీస్ లబ్ధిదారుల ఎంపిక..!
6 Guarantees: ఆరు గ్యారంటీస్ పథకాల అమలుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తం అవుతోంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహించి లబ్ధిదారుల నుంచి ధరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులే క్షేత్రస్థాయికి వెళ్లి.. లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. అర్హులను గుర్తించేందుకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని సర్కార్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.
పారదర్శకత, నిధుల దుర్వినియోగం కాకుండా అర్షులకే లబ్ధిచేకురేలా ప్రభుత్వం ఈ విధానం ప్రకటించింది. కానీ సర్కార్ నిర్ణయంతో రేషన్ కార్డు లేని వేలాది కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. రేషన్ కార్డు లేకపోవడం వల్ల తాము ఎక్కడ ఆరు గ్యారంటీస్‌కు దూరం అవుతామని కంగారు పడుతున్నారు.
తెలంగాణలో దాదాపు 84లక్షల రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. ఐతే గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల జారీలో జాప్యం జరగడంతో 10లక్షల అప్లికేషన్స్ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీస్ పథకాల కోసం రేషన్ కార్డుదారులను అర్హులుగా పెట్టడంతో తమ పరిస్థితి ఏంటని కార్డు లేని కుటుంబాలు వాపోతున్నాయి.
పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్స్‌ను క్లియర్ చేయడంతో పాటు తక్షణమే కొత్త కార్డుల జారీకి దరఖాస్తులు తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డులపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఎలాంటి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయబోతోంది అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటూనే.. మరోవైపు కొత్త కార్డుల జారీకి చర్యలు తీసుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనిపై ప్రతిపక్షాలు కూడా స్పందిస్తున్నాయి. 6 హామీలకు దరఖాస్తులు సరే…. కొత్త రేషన్ కార్డులేవని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించేందుకు అన్ని పార్టీలను భాగస్వాములను చేయండని సంజయ్ కోరారు.
ఆరు గ్యారంటీస్ కోసం ఈనెల 28 నుంచి అప్లికేషన్స్ తీసుకోవాలనే ప్రకటనతో ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో హడావుడి మొదలైంది. మహాలక్ష్మీ పథకం కింద మహిళకు నెలకు 2500 రూపాయలు, ఇల్లు లేని అర్హులకు ఇల్లు. 5వందలకే గ్యాస్,, వంటి పథకాల కోసం జనం ఎదురుచూస్తున్నారు. దానికి రేషన్ కార్డులను లింకు పెట్టడంతో.. కొంత గందగగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. కొత్త రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ కూడా సర్కార్‌కు పెద్దగా సవాల్‌గానే మారింది.
కొత్త కార్డుల కోసం ఎవరిని అర్హులుగా గుర్తించాలి. బిలో పావర్టీ లైన్ కింద ఉన్నట్టుగా ఎలా నిర్దారించాలి. అందుకే ఎలాంటి క్రైటిరియాను పరిగణలోకి తీసుకోవాలని సతమతం అవుతోంది సర్కార్. మొత్తానికి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలోపు.. ఆరు గ్యారంటీస్‌ను అమల్లోకి తీసుకొచ్చి జనాలను తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది కాంగ్రెస్.