రేపు హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad: మ.3 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
Hyderabad: రేపు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అయితే.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా.. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను అనుమతించమని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.