మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని సీక్రెట్‌గా ఎవరు చూస్తున్నారు.. ఇలా సులువుగా తెలుసుకోండి..!
Facebook Tips: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Facebook అన్ని వయసుల ప్రజలలో చాలా ఫేమస్ అయింది.
Facebook Tips: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Facebook అన్ని వయసుల ప్రజలలో చాలా ఫేమస్ అయింది. ప్రతిరోజు దాదాపు చాలామంది ఇందులో యాక్టివ్‌గా ఉంటారు. మీరు కూడా Facebook ఉపయోగిస్తే మీ ప్రొఫైల్‌కి చాలా మంది కనెక్ట్ అవుతారు. అయితే మీకు తెలియకుండా మీ ప్రొఫైల్‌ను రహస్యంగా చూసే వ్యక్తి ఎవరో మీరు కనిపెట్టవచ్చు. వాస్తవానికి ఎఫ్‌బీ ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. కానీ ఒక ట్రిక్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.
1. ముందుగా ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి లాగిన్ కావాలి. అనంతరం పేజీ ఓపెన్ అయిన తర్వాత 'రైట్ క్లిక్' చేయాలి. అందులో 'వ్యూ పేజ్ సోర్స్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
2. దీంతో వెంటనే పేజీ సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. అందులో 'BUDDY_ID' కోసం వెతకాలి. ఇందుకోసం కంట్రోల్+ఎఫ్ (ctrl+F) నొక్కి 'BUDDY_ID'అని టైప్ చేయాలి.
3. ఇలా 'BUDDY_ID' పక్కన అనేక ఫేస్ బుక్ ప్రొఫైల్ ఐడీలు కనిపిస్తాయి. వాటిలో ఏదో ఒక ఐడీని కాపీ చేసుకోవాలి. అనంతరం కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేసి 'Facebook.com/మీరు ఎంచుకున్న ఐడీని' పేస్ట్ చేయాలి.
4. ఈ ఐడీని ఎంటర్ చేయగానే మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరు చూశారో వారి పేజీ ఓపెన్ అవుతుంది. చూశారుగా మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారో.. వారికి కూడా తెలియకుండా ఇలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు.